చిరుత కోసం సీసీ కెమెరాలు:
నెలరోజులుగా ముప్పుతిప్పలు పెడుతోన్న చిరుత - legaduda
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో ఓ చిరుతపులి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రాత్రి పూట గ్రామాల్లో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తోంది.
చిరుతపులి
చిరుతను పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు పలు ప్రాంతాల్లో సీసీకెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. బోనులో చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకుంటూ పశువులను చంపుతోంది. ఎప్పుడు ఏ గ్రామంపై దాడి చేస్తుందో తెలియక రైతులు రాత్రి సమయంలో పొలాలకు వెళ్లడానికి జంకుతున్నారు. సాధ్యమైనంత త్వరగా చిరుతపులిని పట్టుకొని తమ పశువులను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.