తెలంగాణ

telangana

ETV Bharat / state

చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో అన్నదానం - chilukuru balaji temple archakulu ranga rajan distributed food to poor people

చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో నగరంలో ఉన్న అన్నార్తులకు భోజనం అందజేశారు. దాతలు ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలని దేవాలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ కోరారు.

chilukuru-balaji-temple-society-distributed-food-to-poor-people-at-hyderabad-city
చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో అన్నదానం

By

Published : Apr 19, 2020, 10:20 AM IST

లాక్‌డౌన్‌ కాలంలో పేదల ఆకలి తీర్చడానికి దాతలు ముందుకు రావాలని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో నగరంలో రోడ్లపై ఉండే పేదలు, వృద్దులు, వలస కూలీలకు భోజనం పెట్టి వారి ఆకలి తీరుస్తున్నారు.

రోజూ 600 మందికి సరిపోయే వంటలు చేయించి పారడైస్‌, మోహిదీపట్నం, ట్యాంక్ బండ్, లంగర్ హౌస్, సన్ సిటీ, తదితర ప్రాంతాలల్లో భోజనం అందిస్తున్నామని ప్రధాన అర్చకులు తెలిపారు. ప్రతీ ఒక్కరు తమకు తోచిన సాయం చేయాలని కోరారు.

ఇదీ చూడండి:నేతన్నల యాతన... వైరస్​ వ్యాప్తితో కష్టాలు!

For All Latest Updates

TAGGED:

Chevella

ABOUT THE AUTHOR

...view details