ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆరోగ్య ఉపకేంద్రంలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేరు. నెల టీకాలు వేసుకునేందుకు ఆసుపత్రికి వచ్చిన చిన్న పిల్లల తల్లులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని నిజాంపేట్ ప్రభుత్వ ఆరోగ్య ఉపకేంద్రం వద్ద చోటు చేసుకుంది. ఆరోగ్య ఉపకేంద్రంలో సిబ్బంది, వైద్యులు ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలకు సేవలు అందించాలి. అందుకు ఓ వైద్యుడు నలుగురు సిబ్బంది అందుబాటులో ఉండాలి. కానీ ఒక్కరూ కూడా అందుబాటులో లేరు.
ఆరోగ్య ఉపకేంద్రం ఎదుట కుటుంబ సభ్యుల పడిగాపులు - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
ప్రభుత్వ ఆరోగ్య ఉపకేంద్రం ఎదుట పిల్లలను ఎత్తుకుని తల్లులు, వారి కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు.. ఎందుకనుకుంటున్నారా.. ఆ పిల్లలకు నెల టీకాలు వేయించేందుకని వచ్చారు.. కానీ ఆ ఆసుపత్రి గేటు కూడా తీయలేదు.. ఉదయం 9 గంటలకు రావాల్సిన సిబ్బంది, డాక్టర్లు 10 దాటినా రాలేదు. వచ్చిన వారు తీవ్ర ఆవేదన చెంది వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటన నిజాంపేట్లో జరిగింది.
ఆరోగ్య ఉపకేంద్రం ఎదుట కుటుంబ సభ్యుల పడిగాపులు
ఈ కార్యక్రమం ప్రభుత్వ ఉపఆరోగ్య కేంద్రంలో ప్రతి బుధవారం కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఆసుపత్రి వద్ద పసికందులతో మహిళలు, కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి వైద్యులు, సిబ్బంది సమయానుకూలంగా ఆసుపత్రికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి :'పరీక్షలు రాసేందుకు వెళ్లాలి.. బస్సు సౌకర్యం కల్పించండి'
TAGGED:
కుటుంబ సభ్యులు పడిగాపులు