తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకెంతో మేలు జరుగుతుంది' - కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ చేవెళ్లలో సంబురాలు

రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తెరాస కార్యక్తలు టపాసులు పేల్చుతూ సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

Chevelle trs leaders welcomed and celebrated the new Revenue Act
రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

By

Published : Sep 9, 2020, 6:56 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడాన్ని స్వాగతిస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. మండల పార్టీ అధ్యక్షుడు పెద్దోల ప్రభాకర్ ఆధ్వర్యంలో చేవెళ్ల మండల కేంద్రంలోని హైదరాబాద్-బీజపూర్ రహదారిపై టపాసులు పేల్చి స్వీట్లు పంచారు.

ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ చట్టంతో రైతులకు మంచి జరుగుతుందని వారు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:కార్పొరేట్ ఆస్పత్రుల దందా అరికడతాం: కేసీఆర్‌

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details