రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నిరుపేదలకు సరుకులు అందజేశారు.
ఎంపీ రంజిత్ రెడ్డి దాతృత్వం.. పేదలకు సాయం - chevella mp ranjith reddy
చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్‌పేట్, కొండాపూర్ డివిజన్లలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు.
చేవెళ్లలో సరుకుల పంపిణీ
కరోనాను అరికట్టేందుకు ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు పాటించాలని ఎంపీ సూచించారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించి కరోనాను కట్టడి చేయాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదని, బయటకు వెళ్లిన వారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని విజ్ఞప్తి చేశారు.