తెలంగాణ

telangana

ETV Bharat / state

'పురపోరులో గులాబీ పార్టీకి పట్టం కట్టాలి' - తెలంగాణలో మున్సిపల్​ ఎన్నికలు 2020

ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే... పురపాలిక ఎన్నికల్లో తెరాసను గెలిపిస్తాయని చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

chevella mp ranjith reddy campaign for municipal elections in rangareddy district
'పురపోరులో గులాబీ పార్టీకి పట్టం కట్టాలి'

By

Published : Jan 20, 2020, 11:56 AM IST

సర్పంచ్​ స్థాయి నుంచి ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ అందరూ తెరాస నాయకులే ఉన్నారని, పుర ఎన్నికల్లో గులాబీ పార్టీని గెలిపిస్తే మున్సిపాల్టీలు త్వరగా అభివృద్ధి చెందే అవకాశముందని చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో పుర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఇంటింటికి తిరుగుతూ.. తెరాస సంక్షేమ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. సీఎం కేసీఆర్​ సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని ఎంపీ కొనియాడారు.

పురపాలికల ఎన్నికల ప్రచారానికి నేడే చివరి రోజు కావడం వల్ల పాదయాత్ర చేస్తూ గులాబీ పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు.

'పురపోరులో గులాబీ పార్టీకి పట్టం కట్టాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details