చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ఎన్నికై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా చేవెళ్ల రంజిత్ రెడ్డి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డిలో ఐటీ రంగ విస్తరణకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. కేటీఆర్ ఆధ్వర్యంలో ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
'రాష్ట్రాలకు రావాల్సిన నిధుల గురించి ఆలోచించండి' - mp ranjith reddy 1 year celebration
వ్యాపారిగా కంటే ప్రజా సేవకుడిగానే తనకు ఎక్కువ తృప్తి కలిగిందని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ఎన్నికైన సందర్భంగా ఆయన చేసిన అభివృద్ధి పనులను వెల్లడించారు.
'రాష్ట్రాలకు రావాల్సిన నిధుల గురించి ఆలోచించండి'
ఫెడరల్ టైప్ గవర్నమెంట్ కావాలని తపించిన మోదీ... ప్రధానమంత్రి అయ్యాక ఫ్యూడల్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. భాజపా ఎంపీలు రాజకీయాలు కాదు... రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆలోచించాలని హితవు పలికారు. ఎంపీ ల్యాండ్ నిధులు లేకున్నా... ఇతర పథకాల కింద వచ్చే నిధులతో రంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రంజిత్ రెడ్డి వివరించారు.
ఇవీ చూడండి:'దేశవ్యాప్తంగా ఒకేసారి థియేటర్లు తెరుస్తాం'