రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని గండిపేటకు చెందిన రిషికేశ్వర్ కుమారుడు అత్విక్(3) ఇటీవలే కొవిడ్ బారి నుంచి బయటపడ్డాడు. అనంతరం బ్లాక్ ఫంగస్ సోకడంతో ఆ చిన్నారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికే క్యాన్సర్‌తో పోరాడుతోన్నఅత్విక్ చికిత్సకు అవుతోన్న ఖర్చులను.. ఆ పేద కుటుంబం భరించలేకపోయింది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఎంపీ రంజిత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎంపీ.. సీఎం రిలీఫ్ ఫండ్ కింద వారికి రూ. 10 లక్షలు మంజూరు చేయించారు.
CM Relief Fund: పసి హృదయానికి ఎంపీ రంజిత్ రెడ్డి చేయూత - సీఎం రిలీఫ్ ఫండ్
బ్లాక్ ఫంగస్‌కు గురైన ఓ చిన్నారి దీనస్థితిపై చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి స్పందించారు. బాలుడి వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 10 లక్షలు సాయంగా అందజేశారు. ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి చిన్నారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.
CM Relief Fund
ఎంపీ.. బాధితుడి తల్లిదండ్రులకు ఫండ్ మంజూరు చేసిన ఎల్ఓసీ పత్రాన్ని అందజేశారు. ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి చిన్నారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.
ఇదీ చదవండి:TPCC Uttam: ప్రతి కార్యకర్త కుటుంబాన్ని ఆదుకుంటాం: ఉత్తమ్