రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని పహిల్వాన్ చెరువులో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య 90వేల చేపపిల్లల్ని వదిలారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని కులాల అభివృద్ధికి పాటు పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలన్న తపనతోనే.. ముఖ్యమంత్రి చెరువుల్లో ఉచితంగా చేప పిల్లల్ని వదిలే కార్యక్రమం రూపొందించారని అన్నారు.
పహిల్వాన్ చెరువులో చేపపిల్లల్ని వదిలిన ఎమ్మెల్యే - పహిల్వాన్ చెరుువు
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని పహిల్వాన్ చెరువులో చేవెళ్ల శాసనసభ్యులు కాలె యాదయ్య 90,000 చేప పిల్లల్ని వదిలారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం వారికి చేయూతనిస్తుందని ఆయన తెలిపారు.
పహిల్వాన్ చెరువులో చేపపిల్లల్ని వదిలిన ఎమ్మెల్యే
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అవినాశ్ రెడ్డి, ఎంపీపీ ప్రశాంతి, పీఏసీఎస్ ఛైర్మన్ చల్లా శేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ఏడో ఆర్థిక గణాంక సర్వే.. ఉపాధి అవకాశాలు