రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కోర్టు న్యాయమూర్తి స్వాతి మురారి వలస కార్మికుల ఆకలి తీరుస్తున్నారు. భర్త అమిత్ కుమార్తో కలిసి స్వయంగా వంట చేసి.. కారులో తిరుగుతూ వలస కార్మికుల కడుపు నింపుతున్నారు.
ఆకలి తీరుస్తున్న న్యాయమూర్తి! - Chevella court judge Feeding Migration labor
లాక్డౌన్ సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారికి, వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చి పలు ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన వారికి న్యాయమూర్తి స్వాతి మురారి అన్నం పెట్టి ఆకలి తీరుస్తున్నారు. తానే స్వయంగా వంట చేసి.. కారులో పలు ప్రాంతాల్లో తిరిగి వలస కార్మికులకు, కంపెనీల్లో పనిచేసే కార్మికులకు భోజనం అందిస్తున్నారు.
ఆకలి తీరుస్తున్న న్యాయమూర్తి
25 రోజులుగా దాదాపు 7వేల మందికి పైగా అన్నదానం చేశారు. చేవెళ్ల, శంకర్పల్లి మండలాల్లో కంపెనీల్లో పనిచేసే వలస కార్మికుల దగ్గరికి వెళ్లి వారికి రోజూ భోజనం అందిస్తున్నారు.
ఇదీ చూడండి :'కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పినా వైద్యం చేయలేదు'