తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇంటింటికీ నల్లా ఇస్తామని చెప్పి చెంబు నీళ్లిచ్చారు' - viswera reddy

ఓటమి భయంతోనే తెరాస తమ సభలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని చేవెళ్ల లోక్​సభ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. హామీల అమలులో కేసీఆర్​ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

చేవెళ్లలో కాంగ్రెస్​ గెలుపు ఖాయం

By

Published : Apr 3, 2019, 5:57 AM IST

కాంగ్రెస్​ పట్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆపార్టీ లోక్​సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రజా సమస్యలు తెలియని, స్థానికేతరులను తెచ్చి తమ నియోజక వర్గంలో బరిలో నిలిపారని విమర్శించారు. పోలీసులు, తెరాస నేతలు కలిసి తనను ఓడించేందుకు పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇంటింటికీ నళ్లా ఇస్తామని చెప్పుకొచ్చిన తెరాస ప్రభుత్వం.. చెంబు నీళ్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు.

చేవెళ్లలో కాంగ్రెస్​ గెలుపు ఖాయం

ABOUT THE AUTHOR

...view details