షాద్‌నగర్‌లో చిరుతను బంధించిన అటవీ అధికారులు - cheetah caught by forest officers -in-shadnagar
08:28 January 20
షాద్‌నగర్‌లో చిరుత పట్టివేత... నెహ్రూ జూ పార్క్‌కు తరలింపు
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో కలకలం సృష్టించిన చిరుతను అటవీ శాఖ అధికారులు బంధించారు. అనంతరం హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌కు తరలించారు.
షాద్‌నగర్‌లోని పటేల్ రోడ్లో ఓ ఇంటి డాబాపైన చిరుత పడుకుని ఉండటం గమనించిన స్థానికుడు ఆ ఇంట్లో వారికి సమాచారం ఇచ్చాడు. వెంటనే అప్రమత్తమైన ఇంటి యజమాని... అటవీ శాఖ అధికారులు, పోలీసులకు సమచారం అందించారు.
ఘటనా స్థలికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను మత్తుమందు సూదితో షూట్ చేశారు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన చిరుత పారిపోయేందుకు ప్రయత్నించి మత్తెక్కడం వల్ల పక్కింట్లో పడిపోయింది. బంధించిన అటవీ శాఖ సిబ్బంది చిరుతను హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌కు తరలించారు.
- ఇవీ చూడండి: పంటకు ధర కరవు... ఆవేదనలో కందిరైతు