రంగారెడ్డి జిల్లా చందానగర్ డివిజన్లో తెరాసకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని అధికార పార్టీ అభ్యర్థి మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్లోని కైలాశ్‌నగర్, గౌతమి నగర్, బృందావనం అపార్ట్మెంట్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అడుగడుగునా తెరాసకు బ్రహ్మరథం: మంజుల రఘునాథ్‌రెడ్డి - hyderabad civic polls 2020
రంగారెడ్డి జిల్లా చందానగర్ డివిజన్లో తెరాస కార్పొరేటర్ అభ్యర్థి మంజుల రఘునాథ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. నగర అభివృద్ధి తెరాసతోనే సాధ్యమన్న ఆమె... తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
అడుగడుగునా తెరాసకు బ్రహ్మరథం: మంజుల రఘునాథ్‌రెడ్డి
చందానగర్ డివిజన్ అభివృద్ధి తెరాసతోనే సాధ్యమన్న ఆమె... కాలనీల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. నగరాభివృద్ధికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. ప్రజలు మరోసారి తెరాసకే పట్టం కట్టాలని సూచించారు.