తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రధానితో మాట్లాడుతా'

శంషాబాద్​లోని పశు వైద్యురాలి నివాసంలో ఆమె కుటుంబసభ్యులను కేంద్ర సహాయ మంత్రి సంజీవ్​కుమార్​ పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపి ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లి నిందితులతు త్వరగా శిక్ష పడేలా చూస్తామన్నారు.

CENTRAL MINISTER SANJIVKUMAR SPOKE ON SHAMSHABAD INCIDENT
నిందితులకు త్వరగా శిక్షపడేలా చూస్తా: కేంద్రమంత్రి సంజీవ్​కుమార్​

By

Published : Dec 1, 2019, 7:58 PM IST

సమాజంలో ఇప్పటికీ ఇలాంటి పరిస్థితి ఉందంటే సిగ్గుపడాలని కేంద్ర సహాయ మంత్రి సంజీవ్‌కుమార్ అన్నారు. శంషాబాద్​లోని వెటర్నరీ వైద్యురాలి నివాసంలో ఆమె కుటుంబసభ్యులను సంజీవ్‌కుమార్ పరామర్శించి సానుభూతి తెలిపారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. వైద్యురాలిని హత్యాచారం చేసిన నిందితులకు త్వరగానే శిక్షపడేలా చేస్తామన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించానని, సీపీనికలిసి వివరాలు తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.

నిందితులకు త్వరగా శిక్షపడేలా చూస్తా: కేంద్రమంత్రి సంజీవ్​కుమార్​

ABOUT THE AUTHOR

...view details