రంగారెడ్డి జిల్లా తుక్కుగుడా మున్సిపాలిటీ పరిధిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో తెరాస... ఎంఐఎం పార్టీతో కలిసి కుటుంబ పాలన కొనసాగిస్తోందని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో భాజాపాకు ఓట్లు వేసి గెలిపిస్తే చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. రాష్ట్రలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా వల్లేనని కిషన్ రెడ్డి అన్నారు.
'బంగారు తెలంగాణ కాదు... బంగారు కేసీఆర్ కుటుంబం' - CENTRAL MINISTER KISHAN REDDY LATEST NEWS
రాష్ట్రంలో తాగేందుకు నీళ్లు లేకపోయినా... విచ్చల విడిగా మద్యం దొరుకుతుందని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బంగారు తెలంగాణ ఏమో కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు కుటుంబమైందని ఆరోపించారు.

'బంగారు తెలంగాణ కాదు... బంగారు కేసీఆర్ కుటుంబం'
తెరాస పార్టీ ఈరోజు వచ్చి ఓట్లు అడిగితే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయారో అడగాలని సూచించారు. ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే బంగారు తెలంగాణ చేయలేదు కానీ... కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయిందని ఆరోపించారు. రాష్ట్రంలో తాగడానికి మంచి నీళ్లులేకపోయినా... మద్యం మాత్రం విచ్చల విడిగా దొరుకుతుందని కిషన్ రెడ్డి విమర్శించారు.
'బంగారు తెలంగాణ కాదు... బంగారు కేసీఆర్ కుటుంబం'
ఇవీ చూడండి: ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడితో పోలీసులకు తిప్పలు