Ramoji Filmcity as Eat Right Campus: ప్రపంచంలో అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ రామోజీ ఫిల్మ్‌సిటీకి అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అత్యుత్తమ రేటింగ్ కింద ఫిల్మ్‌సిటీని ‘ఈట్ రైట్ క్యాంపస్’గా ధ్రువీకరించింది. ఫిల్మ్‌సిటీని సందర్శించే అతిథులు, పర్యాటకులకు జాతీయ ఆరోగ్య విధాన ప్రమాణాలకు లోబడి సురక్షిత, పరిశుభ్రమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. దాదాపు 1666 ఎకరాల్లో విస్తరించిన రామోజీ ఫిల్మ్‌సిటీలో 15 రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో త్రీస్టార్, ఫైవ్‌స్టార్ కేటగిరీ హోటళ్లు ఉన్నాయి. ఇవన్నీ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్వహించే కఠినమైన ఆడిటింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయి.
Ramoji Filmcity: ఈట్ రైట్ క్యాంపస్‌గా రామోజీ ఫిల్మ్‌సిటీ - ది ఈట్ రైట్ ఉద్యమం
Ramoji Filmcity as Eat Right Campus: ప్రపంచంలో అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ రామోజీ ఫిల్మ్‌సిటీకి అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ అత్యుత్తమ రేటింగ్ కింద ఫిల్మ్‌సిటీని ‘ఈట్ రైట్ క్యాంపస్’గా ధ్రువీకరించింది.
ప్రమాణాలను పూర్తిస్థాయిలో పాటించడంతో ‘ఈట్ రైట్ క్యాంపస్’గా ఫిల్మ్‌సిటీ గుర్తింపు సాధించింది. స్టార్ హోటళ్లకు ఫైవ్‌స్టార్ కేటగిరీతో పరిశుభ్రత, పారిశుద్ధ్య ధ్రువీకరణ లభించింది. దేశంలో ప్రజారోగ్యాన్ని పెంపొందిస్తూ జీవన వ్యాధులపై పోరాటం చేసేందుకు జాతీయ ఆరోగ్య విధానంలో భాగంగా ఆరోగ్య ప్రమాణాలు పెంచేందుకు 2018 జులై 10న ‘సహీ భోజన్, బెహతర్ జీవన్’ నినాదం కింద ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ ‘ది ఈట్ రైట్ ఉద్యమం’ ప్రారంభించింది. ఈ ఉద్యమం కింద దేశంలోని ప్రజలందరికీ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భోజనం అందించాలని లక్ష్యంగా నిర్ణయించింది. అన్ని వయసుల వారిలో సరైన పోషకాలు లేకపోవడంతో తలెత్తే ఆహార సంబంధిత వ్యాధులను అరికట్టాలన్న లక్ష్యాన్ని ఈట్‌రైట్ ఉద్యమంలో భాగం చేసి అమలు చేస్తోంది.
ఇవీ చదవండి: