రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లి గ్రామంలో 176 మంది అర్హులైన మహిళలకు స్మార్ట్ ఫోన్లు అందించారు. నాగన్ పల్లి మహిళా ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో రామోజీ ఫౌండేషన్(RAMOJI FOUNDATION), యాక్సిస్ లైవ్ లీ హుడ్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామ డిజిటలైజేషన్లో భాగంగా మహిళలకు చరవాణీలు అందించారు.
RAMOJI FOUNDATION: నాగన్ పల్లిలో 176 మంది మహిళలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ - cell phones distribution to women in naganpally
రామోజీ గ్రూప్స్ ఛైర్మన్ రామోజీ రావు దత్తత గ్రామం రంగారెడ్డి జిల్లా నాగన్ పల్లి గ్రామంలో.. 176 మంది మహిళలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. రామోజీ ఫౌండేషన్(RAMOJI FOUNDATION) సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
![RAMOJI FOUNDATION: నాగన్ పల్లిలో 176 మంది మహిళలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ nagan pally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13082227-158-13082227-1631791383239.jpg)
కార్యక్రమంలో రామోజీ ఫౌండేషన్ డైరెక్టర్ శివరామకృష్ణ, ఫౌండేషన్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, ఎస్ఎమ్ఈఎస్ సలహాదారు పాపారావు, ఎఫ్పీఓ సలహాదారు మాన్యువల్ ముర్రే, గ్రామ సర్పంచ్ జగన్ పాల్గొన్నారు. రామోజీ గ్రూప్స్ ఛైర్మన్ రామోజీ రావు తమ గ్రామాన్ని దత్తత తీసుకొని అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి చేశారని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు అర్హులైన మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి పాటుపడుతున్న రామోజీరావుకు రుణపడి ఉంటామని వెల్లడించారు.
ఇదీ చదవండి:KTR: ఐటీలో దేశంలోనే తెలంగాణది ఫస్ట్ ప్లేస్... త్వరలోనే టీ వర్క్స్