రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లోని మండల రెవెన్యూ కార్యాలయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సందర్శించారు. విజయారెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ శాఖలో ఉన్న తప్పుడు విధానాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కేసీఆర్ అవలంబిస్తోన్న విధానాలు అటు అధికారులను ఇటు ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం గ్యాంగ్స్టర్ నయీమ్ కేసును, వరంగల్ జిల్లాలో చిన్నారిపై జరిగిన అత్యాచార కేసును నీరుగార్చినట్లే... ఈ కేసును కూడా నీరుగారుస్తుందని మండిపడ్డారు. ఈ కేసును సీబీఐకి అప్పగించి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.
"తహసీల్దార్ హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలి" - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
తహసీల్దారు విజయారెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లోని మండల రెవెన్యూ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు.
తహసీల్దార్ హత్య కేసును సీబీఐకి అప్పజెప్పాలి: వీహెచ్