తెలంగాణ

telangana

ETV Bharat / state

'భరణం ఇప్పించమంటే.. బలత్కారానికి ఒడిగట్టాడు' - CASE FILED ON ADVOCATE

భర్తతో మనస్పర్థలున్నాయి.. భరణం ఇప్పించమని అర్ధించిన ఓ వివాహితపైనే బలత్కారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధ ప్లీడరు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో చోటుచేసుకుంది.

న్యాయం చేయమంటే న్యాయవాదే దాష్టీకానికి ఒడిగట్టాడు
న్యాయం చేయమంటే న్యాయవాదే దాష్టీకానికి ఒడిగట్టాడు

By

Published : Feb 4, 2020, 6:44 AM IST

Updated : Feb 4, 2020, 12:50 PM IST

న్యాయం చేయమంటే న్యాయవాదే దాష్టీకానికి ఒడిగట్టాడు

భర్తతో గొడవలున్నాయని... విడాకుల కోసం న్యాయవాది వద్దకెళ్తే అత్యాచారానికి ఒడిగట్టాడని ఓ మహిళా ఆరోపించింది. రంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఠాణాలో సదరు మహిళ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జ్యోతి నగర్​లో నివాసముండే ఓ మహిళ తన భర్త వేధిస్తున్నాడని 2003 సంవత్సరంలో ఫిర్యాదు చేసింది.

2007లో తనకు మెయింటినెన్స్ కావాలంటూ గతంలో పటాన్ చెరులోని న్యాయవాది రఘునందన్ రావు ద్వారా కేసు దాఖలు చేసినట్లు తెలిపింది.

మత్తు మందు కలిపాడు... అత్యాచారం చేశాడు

పటాన్ చెరులోని ఆయన కార్యాలయానికి సదరు మహిళను పిలిపించుకుని కాఫీలో మత్తు కలిపి ఇచ్చాడని ఆరోపించింది.

అపస్మారక స్థితికి చేరుకున్న తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడని వాపోయింది.

హెచ్​ఆర్సీతో కదిలిన పోలీసులు...

రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోకపోవడం వల్ల మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశానని బాధితురాలు వెల్లడించింది.

హెచ్ఆర్సీ సూచన మేరకు సైబరాబాద్ సీపీ సజ్జనార్​ను కలిస్తే రామచంద్రపురం పీఎస్​లో కేసు నమోదు చేస్తారని చెప్పి పంపారని అన్నారు.

రామచంద్రాపురం ఠాణాలో ఫిర్యాదు చేయడం వల్ల రఘునందన్ రావుపై అత్యాచారం, బెదిరింపు, బ్లాక్ మెయిల్ నేరాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి :'నీది వేరే కులం... నిన్నెలా పెళ్లి చేసుకుంటాననుకున్నావ్'

Last Updated : Feb 4, 2020, 12:50 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details