రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన ఓ మహిళ జ్వరంతో చికిత్స పొందుతూ ఈ నెల 9న ఉస్మానియా ఆసుపత్రిలో మరణించింది. ముందస్తు జాగ్రత్తగా అక్కడ వైద్య సిబ్బంది మృతురాలికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలు రాకముందే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అదేరోజు మృతురాలికి సొంత ఊరిలో అంత్యక్రియలు నిర్వహించారు.
చనిపోయిన తరువాత బంధువులకు షాకిచ్చిన మహిళ - కరోనాతో మహిళ మృతి తాజావార్తలు
రంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఐదు రోజుల క్రితం మరణించి, అంత్యక్రియలు కూడా పూర్తైన ఓ మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆమె అంత్యక్రియలకు హాజరైన వారిని ఆస్పత్రిలో చికిత్స అందించిన సిబ్బందిని క్వారంటైన్‌కు వెళ్లాలని అధికారులు సూచించారు.
చనిపోయిన తరువాత బంధువులకు షాకిచ్చిన మహిళ
ఆమె అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. మృతదేహానికి నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్ వచ్చిందని ఆశావర్కర్లు సోమవారం తెలిపారు. దీనివల్ల అంత్యక్రియల్లో పాల్గొన్న వారంతా ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో మృతురాలి ఇంటి చుట్టుపక్కల ఎవరు బయటికి రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు.