రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలోని వంతెన వద్ద ప్రమాదవశాత్తు... 2 లారీల మధ్య ఓ కారు ఇరుక్కుపోయింది. రోడ్డు మధ్యలో నిలిచిపోవటం వల్ల హైదరాబాద్ వైపు వచ్చే మార్గంలో వాహనాలకు దారి లేక భారీ ఎత్తున నిలిచిపోయాయి. నీది తప్పంటే... నీది తప్పు అంటూ లారీ, కారు డ్రైవర్లు వాగ్వాదానికి దిగారు.
లారీల మధ్య ఇరుక్కున్న కారు... 2 కి.మీల మేర ట్రాఫిక్ జామ్ - రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్జామ్
హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ల అత్యుత్సాహమో... అతివేగం వల్లనో... రెండు భారీ లారీల మధ్యలో ఓ కారు ఇరుక్కుపోయింది. ఎలాంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ... రోడ్డుపైనే వాహనాలు నిలిపేసి డ్రైవర్లు వాగ్వాదానికి దిగటం వల్ల భారీ ఎత్తున ట్రాఫిక్జామ్ అయ్యింది.
![లారీల మధ్య ఇరుక్కున్న కారు... 2 కి.మీల మేర ట్రాఫిక్ జామ్ car struck in between 2 lorries at abdhullapurmet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9437606-139-9437606-1604560586519.jpg)
car struck in between 2 lorries at abdhullapurmet
లారీల మధ్య ఇరుక్కున్న కారు... 2 కి.మీల మేర ట్రాఫిక్ జామ్
ఫలితంగా సుమారు 2 కి.మీ. మేర వాహనాలు నిలిపోయాయి. ప్రయాణికులు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కారుకు ఎలాంటి నష్టం కలగకుండా లారీలను తప్పించే ప్రయత్నం చేశారు.
ఇదీ చూడండి: హైదరాబాద్ మెట్రోలో పవన్ కల్యాణ్ షూటింగ్
Last Updated : Nov 5, 2020, 2:38 PM IST