రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారిపై నుంచి అతి వేగంతో వచ్చిన కారు పక్కనే ఉన్న మిర్చి, జిలేబీ తయారీ దుకాణాల్లోకి దూసుకెళ్లింది. షాపులో పనిచేస్తున్న నలుగురిపై వేడి నూనె మీదపడి తీవ్రగాయాలయ్యాయి.
జిలేబీ దుకాణంలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురికి గాయాలు - Car crashed into a Jelebi Center
అతి వేగంతో వచ్చిన ఓ కారు జిలేబీ తయారీ దుకాణంలోకి దూసుకెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో చేటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కారు బీభత్సానికి భయంతో స్థానికులు పరుగులు తీశారు.
బీభత్సం: జిలేబీ దుకాణంలోకి దూసుకెళ్లిన కారు... నలుగురికి తీవ్ర గాయాలు
కారు బీభత్సానికి భయంతో స్థానికులు పరుగులు తీశారు. బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. షాద్నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న హోండా సిటి కారు ప్రమాదానికి కారణమైంది. ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌లో కారు నడిపిన మహిళ లొంగిపోయింది. కారు బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం చోటుచేసుకుందని కారు నడిపిన మహిళ పేర్కొంది.
ఇదీ చూడండి:భారత్ బంద్ ప్రశాంతం... అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు