రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ బస్టాండ్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై ఓ కారులో మంటలు చెలరేగాయి. ఎల్బీనగర్ నుంచి విజయవాడ రహదారి వైపు వెళ్తున్న జైలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారులో నుంచి దిగిపోయాడు.
జాతీయ రహదారిపై కారులో చెలరేగిన మంటలు - telangana varthalu
హయత్నగర్ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
జాతీయ రహదారిపై కారులో చెలరేగిన మంటలు
ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం వల్ల స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో విజయవాడ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి: మద్యం మత్తులో వాహనాలను ఢీకొట్టిన యూట్యూబ్ ఫేం షణ్ముఖ్