తెలంగాణ

telangana

ETV Bharat / state

పీవీ ఎక్స్​ప్రెస్​ వేపై ట్రాఫిక్ జామ్ - అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టిన కారు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​ వద్ద ఓ కారు అదుపుతప్పి డివైడర్​ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

car accident in rajendra nagar
అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టిన కారు

By

Published : Jan 31, 2020, 9:48 AM IST

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్​లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పీవీ నరసింహరావు వంతెనపై వస్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టింది. ఫిల్లర్ నెంబర్ 240 వద్ద చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

శంషాబాద్ విమానాశ్రయం నుంచి మెహదీపట్నం వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు. ప్రమాదం వల్ల వంతెనపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఒక వైపు వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టిన కారు

ఇవీ చూడండి:టీఎస్​రెడ్కో కుంభకోణంలో కొనసాగుతోన్న అరెస్టుల పర్వం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details