రాష్ట్రవ్యాప్తంగా పురపాలక ఎన్నికలకు అభ్యర్థులు తొలిరోజు నామపత్రాలు దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట కార్పొరేషన్‌కు మొదటి రోజు 10 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు పత్రాలు సమర్పించినట్లు మీర్‌పేట కమిషనర్ బడుగు సుమన్‌రావు వెల్లడించారు. ప్రతి కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించి హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామని.. ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ఎన్నికల పర్యవేక్షకులు కేవై నాయక్ మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. కేవై నాయక్ వెంట ఆర్డీవో రవీందర్ రెడ్డి ఉన్నారు.