తెలంగాణ

telangana

ETV Bharat / state

Coconut Business: తాగి పడేసిన కొబ్బరి బోండాలతో వ్యాపారం... ఐడియా అదుర్స్ బాసూ! - Telangana news

Coconut Business: కొబ్బరి బోండాలు తాగిన తర్వాత ఎవరైనా చెత్తలో పారేస్తారు. వాటిని వ్యర్థ పదార్థంగా భావిస్తుంటారు. కానీ తాగి పడేసిన బోండాలతోనే ఓ వ్యక్తి వ్యాపారం చేస్తున్నారు. మరో 12 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వ్యర్థం నుంచి సంపద సృష్టిస్తున్న వైనంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Coconut Business
Coconut Business

By

Published : Dec 17, 2021, 7:45 PM IST

తాగి పడేసిన కొబ్బరి బోండాలతో వ్యాపారం... ఐడియా అదుర్స్ బాసూ!

Coconut Business:: గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని రహదారుల పక్కన వందల సంఖ్యలో కొబ్బరి బోండాల కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో తాగి ప‌డేసే బోండాల‌ను జీహెచ్​ఎంసీ కార్మికులు సేకరించి.. జ‌వ‌హార్‌న‌గ‌ర్ డంపింగ్ యార్డులో ప‌డేస్తారు. కానీ వ్యర్థంగా భావించే కొబ్బరి బోండాలతో వ్యాపారం చేస్తున్నారు.. హైదరాబాద్‌ కుంట్లూర్‌కు చెందిన నాగరాజు. తన సొంత వాహనాలను కొబ్బరి బోండం కేంద్రాల వద్దకే పంపి వీధివ్యాపారుల వద్ద సేకరిస్తున్నారు. చెత్తలోకి వెళ్లే బోండాలతో... వివిధ వస్తువుల్లో వాడే ముడిపదార్థాన్ని తయారు చేస్తున్నారు.

పాతికేళ్ల క్రితం...

హయత్‌నగర్‌ సమీపంలోని కుంట్లూరులో పాతికేళ్ల క్రితం టెంకాయ‌ల‌తో నాగ‌రాజు తండ్రి ఈ వ్యాపారం మొద‌లు పెట్టారు. వాటి కొర‌త ఏర్పడ‌టంతో వ్యాపారంలో కొబ్బరి బోండాల‌ను నాగరాజు భాగం చేశారు. రోజూ మూడున్నర ట‌న్నుల బోండాల నుంచి 50 శాతం పీచు, 50శాతం కొబ్బరి ఎరువును తయారు చేస్తున్నారు. వాటిని హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ పీచును సోఫాలు, కుర్చీలు, విగ్రహాలు సహా చాలా వస్తువుల తయారీలో వాడుతున్నట్లు తెలిపారు. ఈ యూనిట్‌లో కుటుంబ సభ్యులతో పాటు మరో 12 మంది పనిచేస్తున్నట్లు తెలిపారు.

మార్కెటింగ్ సౌకర్యం...

ఈ వ్యాపారానికి 20 లక్షల పెట్టుబడి అవుతుందని... యంత్రాలను సొంతంగా తయారు చేసుకుంటామని నాగరాజు తెలిపారు. ఉత్సాహవంతులకు యంత్రాలు తయారు చేసి ఇవ్వడమే కాకుండా... వారు ఉత్పత్తి చేసిన సరుకును తామే కొని మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details