ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్య వైఖరి కారణంగా దుకాణ సముదాయాలపై బస్సు దూసుకెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వికారాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా చేవెళ్ల మండల కేంద్రం ఇంద్రారెడ్డి చౌరస్తా వద్ద ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్ర మత్తులో రోడ్డు పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. తీవ్ర గాయాల పాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. బస్సులోని ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
నిద్ర మత్తులో డ్రైవర్.. దుకాణాలపైకి దూసుకెళ్లిన బస్సు - HYDERABAD DEPOT
రంగారెడ్డి జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆర్టీసీ డ్రైవర్ నిద్ర మత్తులో బస్సు నడపడం వల్ల దుకాణాలపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో గాయపడ్డ ఇద్దరు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
తీవ్ర గాయాలతో ఇద్దరి ఆసుపత్రికి తరలింపు