రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేడ్కర్ భవనంలోని బుద్ద విగ్రహానికి అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు, సభ్యులు, పలువురు నాయకులు పూలు వేసి కొవ్వొత్తులు వెలిగించి స్మరించుకున్నారు.
చేవెళ్లలో ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు - బుద్ధ పౌర్ణమి
బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ప్రతి ఒక్కరు బుద్ధుని అడుగుజాడల్లో నడవాలని నాయకులు సూచించారు.
![చేవెళ్లలో ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు budda birth anniversary celebrations in chevella](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7096822-366-7096822-1588838820340.jpg)
చేవెళ్లలో ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు
బుద్ధుడు ఎంచుకున్న శాంతి మార్గం ద్వారా అంబేడ్కర్ లాంటి ఎంతో మంది గొప్పవారయ్యారని నాయకులు వివరించారు. బుద్ధుని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని సూచించారు. సమసమాజ స్థాపనకు కృషి చేసిన గొప్ప మానవతావాది అని కొనియాడారు.