సంగారెడ్డి జిల్లా టేక్మాల్ మండలం సిరిపల్లి చెందిన సురేశ్ తన కొడుకు మూడేళ్ల హరీశ్‌తో కలిసి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దారణగర్లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ ఫంక్షన్లో వేడి వేడి సాంబార్ హరీశ్‌పై పడింది. తీవ్ర గాయాలైన హరీశ్‌ను హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
వేడి సాంబార్ మీద పడి బాలుడి మృతి - వేడి సాంబార్ మీద పడి బాలుడి మృతి
నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన తల్లిదండ్రులు ఆదమరిస్తే ఏం జరుగుతుందో ఈ ఘటన మరోసారి కళ్లకు కట్టింది. వేడి వేడి సాంబార్ మీద పడి మూడేళ్ల బాబు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా సర్దారణగర్లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
![వేడి సాంబార్ మీద పడి బాలుడి మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5116820-thumbnail-3x2-bal.jpg)
boy dead
Last Updated : Nov 19, 2019, 11:46 PM IST