తెలంగాణ

telangana

ETV Bharat / state

రక్తదానం ప్రాణదానంతో సమానం - latest news on Blood donation equals to life

రంగారెడ్డి జిల్లా ఆలూరులో గ్రామానికి చెందిన అంజయ్య, శేఖర్​గౌడ్​ బృందం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. చేవెళ్ల సీఐ బాలకృష్ణ, ఎస్సై రేణుకారెడ్డి శిబిరాన్ని సందర్శించి.. రక్తదాతలను అభినందించారు.

Blood donation equals to life
రక్తదానం ప్రాణదానంతో సమానం

By

Published : May 4, 2020, 12:07 PM IST

రక్తదానం ప్రాణదానంతో సమానమని చేవెళ్ల సీఐ బాలకృష్ణ, ఎస్సై రేణుకారెడ్డి పేర్కొన్నారు. రంగారెడి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన అంజయ్య, శేఖర్‌గౌడ్‌ బృందం ఆధ్వర్యంలో హెల్త్​కేర్‌ బ్లడ్‌బ్యాంక్ సహకారంతో ఆలూరులో రక్తదానం శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని సందర్శించిన సీఐ, ఎస్సైలు రక్తదాతలను అభినందించారు.

దాతలకు సీఐ ప్రశంశా పత్రాలు అందజేశారు. 90 మంది యువకులు రక్తదానం చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచి విజయలక్ష్మి, ఉప సర్పంచి వెంకటేశ్, ఎంపీటీసీ సభ్యులు నరేంద్రాచారి, యాదమ్మ, నర్శింహులు, ప్రవీణ్ కుమార్​, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:భద్రాద్రిలో మంటలు.. భయాందోళనలో ప్రజలు

ABOUT THE AUTHOR

...view details