తెలంగాణ

telangana

ETV Bharat / state

హయత్​నగర్​లో భాజపా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం - BJP set to organize blood donation campaign

హయత్​ నగర్​లో భాజపా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తలసేమియా బాధితుల కోసం రక్తం సేకరించేందుకు ఈకార్యక్రమం నిర్వహించినట్లు ఎమ్మెల్సీ రామచంద్రరావు వెల్లడించారు.

హయత్ నగర్ లో భాజపా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Blood donation camp under Bhajapa in Hayat Nagar

By

Published : May 10, 2020, 8:17 PM IST

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​లో భాజపా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. తలసేమియా బాధితుల కోసం రక్తం సేకరించేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు నిర్వహించినట్లు వెల్లడించారు.

ప్రజా సేవాలో భాజపా ప్రథమం

సుమారు వంద మందికి పైగా యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు. ప్రజా సేవాకార్యక్రమాలలో భాజపా ఎల్లప్పుడు ముందు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో ప్లాస్మా థెరపీకి సన్నాహాలు

ABOUT THE AUTHOR

...view details