రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అప్పోజీ గూడలో లక్ష్య సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్య సాధన ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రజ్ఞ రాజు, గ్రామ సర్పంచ్ రాజు పాల్గొనగా 70 మంది యువకులు రక్తదానం చేశారు.
తలసేమియా, క్యాన్సర్ రోగుల కోసం రక్తదానం - తలసేమియా రోగుల కోసం రక్తదానం శిబిరం
రంగారెడ్డి జిల్లా అప్పోజీ గూడలో తలసేమియా, క్యాన్సర్ బాధితుల కోసం లక్ష్య సాధన ఫౌండేషన్ రక్తదానం శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 70 మంది యువకులు రక్తదానం చేశారు. వారందరికీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రజ్ఞ రాజు కృతజ్ఞతలు తెలిపారు.
తలసేమియా, క్యాన్సర్ రోగుల కోసం రక్తదానం
రక్తదాన శిబిరం నిర్వహించడం ఆనందంగా ఉందని.. తలసేమియా, క్యాన్సర్ బాధితులకు అండగా ఉండటం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రజ్ఞరాజు తెలిపారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
ఇదీచూడండి:పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది