రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో పోలీసులు, రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. దీనిని స్థానిక ఎస్సై శంకరయ్య ప్రారంభించారు. వివిధ గ్రామాల నుంచి యువకులు, స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. ప్రతిరోజూ ఎంతోమంది ప్రమాదాల బారినపడి సకాలంలో రక్తం లభించక మరణిస్తున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు.
'రక్తదానంతో మరొకరికి ప్రాణదానం చేయొచ్చు'
రక్తదానం చేయడమంటే ప్రాణదానంతో సమానమని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్యవంతులు రక్తం దానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు.
రక్తదానం ప్రాణదానంతో సమానం
అలాంటి వారిని ఆదుకునేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదానం చేసిన వారమవుతామని తెలిపారు. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.