రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద భాజపా నాయకులు రాస్తారోకో చేశారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్న అధిష్ఠానం పిలుపు మేరకు ధర్నాకు దిగారు. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన టీచర్లు, లెక్చరర్లకు గౌరవ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి' - bjp protest rangareddy district
రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అధిష్ఠానం పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో భాజపా నేతలు ఆందోళనకు దిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని విమర్శించారు.
రాజేంద్రనగర్లో భాజపా ధర్నా
ఈ కార్యక్రమంలో భాజపా కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని విమర్శించారు.
- ఇదీ చూడండి :మధ్యప్రదేశ్లో అదృశ్యం.. బెంగాల్లో ప్రత్యక్షం