తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం అందించిన భాజపా శ్రేణులు - పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం అందించిన భాజపా శ్రేణులు

భాజపా నాయకులు రవీందర్ రెడ్డి హయత్​నగర్​లో పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం అందించారు. వైరస్ నుంచి విముక్తి కల్పించడంలో వీరి సేవలను ఆయన కొనియాడారు.

bjp party members distribute tiffens to municipal workers
పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం అందించిన భాజపా శ్రేణులు

By

Published : Apr 4, 2020, 3:25 PM IST

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​లో పారిశుద్ధ్య కార్మికులకు భాజపా నాయకులు కల్లెం రవీందర్ రెడ్డి అల్పాహారం అందించారు. లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యం పరిసరాల పరిశుభ్రత చేసే పారిశుద్ధ్య కార్మికులు తినడానికి తిండి లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. వైరస్ నుంచి విముక్తి కల్పించడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివని కొనియాడారు.

పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం అందించిన భాజపా శ్రేణులు

సుమారు 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు... ఐదు రోజుల నుంచి అల్పాహారం తయారు చేయించి పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. లాక్​డౌన్ ఎన్ని రోజులు ఉంటే అప్పటివరకు అల్పాహారం పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే నియమాలను పాటించి, కరోనా కట్టడికై స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించాలని కోరారు.

ఇవీ చూడండి:రికార్డు స్థాయిలో కేసులు... ఉలిక్కిపడ్డ భాగ్యనగరం

ABOUT THE AUTHOR

...view details