కేంద్ర ప్రభుత్వ నిధులతో కొత్తూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హామీ ఇచ్చారు. భాజపా విజయంతోనే పురపాలిక రూపురేఖలు మారుతాయని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కొత్తూరులో రోడ్ షో నిర్వహించారు.
భాజపా గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం : డీకే అరుణ - భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
మున్సిపల్ ఎన్నికల్లో భాజపా గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కొత్తూరులో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కొత్తూరులో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎన్నికల ప్రచారం
తెరాస పాలనలో అభివృద్ధి శూన్యం
తెరాస అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని డీకే అరుణ విమర్శించారు. కేవలం శిలాఫలకాలకే వారి పాలన పరిమితమైందని ఆరోపించారు. రాష్ట్రంలో తెరాస నాయకులు మరోసారి ప్రజలను ప్రలోభపెట్టేందుకు చూస్తున్నారని...వారి మాయమాటలకు లోను కావద్దని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర విమోచన కమిటీ ఛైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి:గ్రేటర్ వరంగల్ బరిలో రౌడీషీటర్లు
Last Updated : Apr 25, 2021, 10:49 PM IST