తెలంగాణ

telangana

ETV Bharat / state

JP Nadda meet hero Nitin జేపీ నడ్డాతో టాలీవుడ్‌ హీరో నితిన్‌ భేటీ - JP Nadda meet with nitin

JP Nadda meet hero Nitin హైదరాబాద్‌ చేరుకున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టాలీవుడ్‌ హీరో నితిన్‌తో భేటీ అయ్యారు. శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో సమావేశమయ్యారు. ఇటీవల అమిత్‌ షా ఎన్టీఆర్‌ను కలవగా, తాజాగా వీరిద్దరి భేటీ కావడం చర్చకు దారితీసింది.

JP Nadda meet hero Nitin
JP Nadda meet hero Nitin

By

Published : Aug 27, 2022, 8:29 PM IST

JP Nadda meet hero Nitin భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హీరో నితిన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇవాళ హనుమకొండ సభకు హాజరైన నడ్డా నితిన్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇవాళ ఉదయం విమానాశ్రయం చేరుకున్న జేపీ నడ్డా మాజీ మహిళ క్రికెటర్ మిథాలీ రాజ్‌తోనూ భేటీ అయ్యారు.

జేపీ నడ్డాతో టాలీవుడ్‌ హీరో నితిన్‌ భేటీ

ఇటీవల మునుగోడు సభకు హాజరైన కేంద్రం హోమంత్రి సైతం ఎన్టీఆర్‌ను కలవడంతో రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో భాజపా నాయకులు టాలీవుడ్ హీరోలతో భేటీ అవుతుండటం రాజకీయ వర్గాల్లో పలు చర్చలకు తావిస్తోంది. ఈ భేటీలో ఎంపీ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు కూడా పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details