తెలంగాణ

telangana

ETV Bharat / state

రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ని గద్దె దించడం ఖాయం: తరుణ్ చుగ్ - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఆరోపించారు. నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ని గద్దె దించడం ఖాయమని అన్నారు.

bjp-national-general-secretary-tarun-chugh-fires-on-cm-kcr-and-trs-government-at-badangpet-in-rangareddy
రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ని గద్దె దించడం ఖాయం: తరుణ్ చుగ్

By

Published : Mar 10, 2021, 5:42 PM IST

బంగారు తెలంగాణ పేరిట రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దోపిడీ రాష్ట్రంగా మార్చారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. రాష్ట్రంలో నియంత పాలన కొసాగుతోందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ని గద్దె దించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశారని... రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. అమరులవీరుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో పేదలు, ఉద్యమకారులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో భాజపా సీనియర్ నాయకులు పేరాల శేఖర్ రావు, జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జ్ అందెల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఓటుకు నోటు కేసు.. విచారణ ఈ నెల 15కు వాయిదా

ABOUT THE AUTHOR

...view details