తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలి' - 'ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలి'

దళిత మహిళ ఎంపీపీ పట్ల ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వ్యవహరించిన తీరు సరైనది కాదని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తెలిపారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకొని ఎంపీపీ సుకన్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

muralidhar rao fires on mla
'ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలి'

By

Published : May 23, 2020, 4:31 PM IST

రంగారెడ్డి జిల్లా యాచారం ఎంపీపీ సుకన్యను భాజపా జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు పరామర్శించారు. జిల్లాలోని నందివనపర్తి గ్రామంలో ఫార్మాసిటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ సుకన్యని ఆహ్వానించలేదని, అడిగినా ఎమ్మెల్యే పట్టించుకోకుండా పనులు ప్రారంభించడం వల్ల ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

రంగంలోకి దిగిన పోలులు ఎంపీపీని నెట్టివేశారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడ్డ ఎంపీపీ సుకన్య నివాసానికి వెళ్లి మురళీధర్ రావు పరామర్శించారు. ప్రొటోకాల్ పాటించకపోవడమే కాకుండా... దళిత మహిళా ఎంపీపీ పట్ల అధికార పార్టీ ఎమ్మెల్యే వ్వవహరించిన తీరు సరికాదని తెలిపారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై చర్యలు తీసుకునేంతవరకు భారతీయ జనతా పార్టీ ఎంపీపీ సుకన్యకు అండగా ఉంటుందని అన్నారు.

ఇవీ చూడండి:'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details