పేదలకు రెండు పడక గదుల ఇళ్ల హామీని తెరాస ప్రభుత్వం నెరవేర్చలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. మంచి నీటి బిల్లులు మాఫీ అయితే... నీటి మీటర్లను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్, కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్ డివిజన్లలో నిర్వహించిన రోడ్ షోల్లో ఆయన పాల్గొన్నారు.
నీటి బిల్లులు మాఫీ అయితే మీటర్లు ఎందుకు?: ఎంపీ అర్వింద్ - జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం 2020
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు డివిజన్లలో నిర్వహించిన రోడ్‌షోల్లో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. రెండు పడక గదుల ఇళ్ల హామీని తెరాస ప్రభుత్వం నెరవేర్చలేదని గుర్తు చేశారు. నీటి మీటర్లు ఎందుకు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
నీటి బిల్లులు మాఫీ అయితే మీటర్లు ఎందుకు?: ఎంపీ అర్వింద్
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా రెండున్నర కోట్ల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం నిర్మించిందని ఆయన తెలిపారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ తెచ్చిన ఘనత నరేంద్ర మోదీదే అని గుర్తు చేశారు.
ఇదీ చదవండి:'రాష్ట్ర పథకాల్లో అధికశాతం కేంద్రం భాగస్వామ్యంతోనే అమలు'