న్యాయవాదులను ఓట్లడిగే నైతిక హక్కు తెరాస ప్రభుత్వానికి లేదని విమర్శించారు భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్ రావు. వామన్రావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో భాజపా లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన న్యాయవాదుల సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
'న్యాయవాదులను ఓట్లడిగే హక్కు.. తెరాసకు లేదు' - భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్ రావు
న్యాయవాద దంపతుల హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్ రావు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో భాజపా లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన న్యాయవాదుల సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
'న్యాయవాదులను ఓట్లడిగే హక్కు.. తెరాసకు లేదు'
ఎమ్మెల్సీగా గెలిస్తే.. న్యాయవాదుల అభ్యున్నతికి పాటు పడతానని హామీ ఇచ్చారు రాంచందర్ రావు. లాయర్లకు రక్షణ చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. త్వరలో వారంతా ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని వివరించారు.