రంగారెడ్డి జిల్లా హయత్నగర్ డివిజన్ భాజపా నేతలు భాగ్యలత కాలనీ నుంచి సుష్మా థియేటర్ వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు. యాత్రలో భాగంగా బీడీఎల్ కాలనీ, శారదా నగర్, సుభద్రనగర్, కమలానగర్ ప్రాంతాల్లోని ప్రజల నుంచి ఎల్ఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నట్లు సంతకాల సేకరణను చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి హాజరయ్యారు.
ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని భాజపా పాదయాత్ర - హైదరాబాద్ జిల్లా తాజా వార్తలు
ఎల్ఆర్ఎస్ 131, 135 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా హయత్నగర్ డివిజన్ భాజపా నేతలు భాగ్యలత కాలనీ నుంచి సుష్మా థియేటర్ వరకు భారీ పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజల వద్ద సంతకాల సేకరణను చేపట్టారు.
ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భాజపా పాదయాత్ర
పేద ప్రజలకు పెనుభారమైన ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని.. తెరాస ఆరేళ్ల పాలనలో ఇలాంటి హామీలు అమలు కాలేదని.. మాయమాటలు చెప్పి కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నారని సామ రంగారెడ్డి ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో భాజపాను గెలిపించి తెరాసకు ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండిఃసర్కారు ఖజానా నింపుకునేందుకే ఎల్‌ఆర్‌ఎస్: అఖిలపక్షం