అక్రమ అరెస్టులను నిరసిస్తూ భాజపా నాయకులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఆందోళన చేపట్టారు. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఆందోళనలకు దిగారు. కేసీఆర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాగా అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
చేవెళ్లలోని పలువురు భాజపా నేతల హౌస్అరెస్ట్.. - చేవెళ్లో భాజపా నేతలు హౌస్ అరెస్ట్
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల్లోని భాజపా నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఛలో హైదరాబాద్ కార్యక్రమం ముందుస్తు చర్యల్లో భాగంగా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు.
చేవెళ్లలోని పలువురు భాజపా నేతలు హౌస్అరెస్ట్
భాజపా 'ఛలో హైదరాబాద్' పిలుపు మేరకు పోలీసులు ముందస్తుగా చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల్లోని ఆయా పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు పద్మనాభం, ప్రభాకర్ రెడ్డి, శ్రీరాములు తదితరుల నేతలను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి:'దుబ్బాకలో పెద్దఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు'