ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేసి భాజపా విజయానికి తోడ్పాటు అందించాలని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ కోరారు. వనస్థలిపురంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎన్నికల్లో భాజపా గెలిస్తే సాధారణ ఎన్నికల్లో సీఎం పదవి కూడా కమలం గుర్తుదేనని రాం చందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఆ దిశగా ప్రతి కార్యకర్త పనిచేసి, ఏ అవకాశాన్ని వదలకుండా, ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు.
గ్రేటర్ ఎన్నికల మాదిరిగా కృషి చేయాలి: రాంచందర్ రావు - వనస్థలిపురంలో భాజపా సమావేశం
రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో ఎల్బీనగర్ నియోజకవర్గ భాజపా ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాంచందర్ రావు.. తనను గెలిపించేందుకు కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. ఈ ఎన్నికల్లో గెలిచినట్లయితే సాధారణ ఎన్నికల్లో సీఎం పదవి భాజపాదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్ రావు
ఒక్కో కార్యకర్త కనీసం 25 మంది ఓటర్లను కలిసి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను వారికి వివరించాలని చెప్పారు. కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు క్షేత్ర స్థాయిలో పనిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ విజయానికి ఎల్బీ నగర్ నియోజకవర్గం కీలకమని.. గ్రేటర్ ఎన్నికల్లో పనిచేసిన విధంగానే ఈ ఎన్నికల్లోనూ పనిచేయాలని రాం చందర్‌రావు సూచించారు.
ఇదీ చదవండి:కాంగ్రెస్ పార్టీ గోడలు పెచ్చులూడిపోయాయి: మంత్రి సత్యవతి