కరోనా విజృంభించి పలువురు మరణిస్తున్నా స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి మాత్రం చలనం లేదని భాజపా రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడ డివిజన్లో జరుగుతున్న కార్పొరేటర్ బై ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా ఆయన కాలనీల్లో పర్యటించారు. ప్రజలను కలుస్తూ ఓట్లు అభ్యర్థించారు. కరోనా విజృంభిస్తున్నా కూడా స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం బయటకు రావడం లేదని విమర్శించారు.
'ఎమ్మెల్యే బయటకు వచ్చి సమస్యలు పరిష్కరించాలి'
ప్రజలు కొవిడ్ కారణంగా ఇబ్బంది పడుతున్నా స్థానిక ఆస్పత్రుల్లో సమస్యలు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పరిష్కరించకపోవడం దారుణమని భాజపా రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు. లింగోజిగూడ డివిజన్లో జరుగుతున్న కార్పొరేటర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వీధుల్లో ప్రచారం నిర్వహించారు.
'ఎమ్మెల్యే బయటకు వచ్చి సమస్యలు పరిష్కరించాలి'
సరూర్ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ ఏరియాల్లో ఉన్న కరోనా పరీక్ష కేంద్రాల్లో టెస్టింగ్ కోసం వస్తున్న జనాలకు కనీస వసతులు ఉండటం లేదని పేర్కొన్నారు. గత మూడు రోజులుగా కిట్లు లేక వేల టెస్టులు నిలిచిపోయినా ప్రజలకు సమాధానం చెప్పలేని దుస్థితి ఉందన్నారు. గెలిచిన తర్వాత ఓట్లు వేసిన జనాలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని విమర్శించారు. డివిజన్లో ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయని సామ రంగారెడ్డి వెల్లడించారు.
ఇదీ చూడండి :ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎప్పుడు పెంచుతారు : హైకోర్టు