తెలంగాణ

telangana

ETV Bharat / state

'తుక్కుగూడలో కేకేకు ఓటు... రాజ్యాంగాన్ని కాలరాయడమే' - తుక్కుగూడలో కేకేకు ఓటు హక్కు కల్పించడంపై భాజపా ఫిర్యాదు

భాజపాకు షాక్​ ఇస్తూ...  తుక్కుగూడ మున్సిపాలిటీని తెరాస చేజిక్కించుకుంది.  తుక్కుగూడలో కేశవరావుకు ఓటు హక్కు కల్పించడంపై ఎస్​ఈసీ నాగిరెడ్డికి భాజపా నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఫిర్యాదు చేశారు.

bjp leader complain on trs
తుక్కుగూడలో కేకేకు ఓటు హక్కు కల్పించడంపై భాజపా ఫిర్యాదు

By

Published : Jan 27, 2020, 5:28 PM IST

తుక్కుగూడలో కేకేకు ఓటు హక్కు కల్పించడంపై భాజపా ఫిర్యాదు

తుక్కుగూడలో కేశవరావు ఎక్స్​అఫీషియో ఓటు వినియోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్​ఈసీ నాగిరెడ్డిని కలిసిన భాజపా నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి కేకేకు ఓటు హక్కు కల్పించడంపై ఫిర్యాదు చేశారు. స్వతంత్ర సభ్యుడి సహా భాజపా కౌన్సిలర్లను ప్రలోభ పెడుతూ తెరాస అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

ఎక్స్ అఫీషియోలుగా ఎంపీ కేశవరావు, మంత్రి సబితాఇంద్రారెడ్డి, నాయిని, ఎగే మల్లేశం, జనార్దన్ రెడ్డి ఓటు వేసేందుకు వచ్చారు. ఇప్పటికే తెరాసకు స్వతంత్ర అభ్యర్థి మద్దతు తెలిపారు. భాజపా సభ్యుల తరఫున ఎక్స్ అఫీషియోగా గరికపాటి మోహన్ రావు హాజరయ్యారు. చివరి నిమిషంలో భాజపాకు షాక్​ ఇస్తూ తెరాస తుక్కుగూడ పురపాలికను తన ఖాతాలో వేసుకుంది.

ఇదీ చూడండి : 'కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు 5 కోట్లకు అమ్ముడుపోయారు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details