లింగోజీగూడ డివిజన్ ఎన్నికలో భాజపా గెలుపు ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్లెం రవీందర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పరిధిలోని లింగోజీగూడ డివిజన్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా పలు కాలనీల్లో పర్యటించారు. శాతవాహననగర్‌లో నాయిబ్రాహ్మణ సంఘం యువతను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
లింగోజిగూడలో భాజపా గెలుపు ఖాయం: రవీందర్ రెడ్డి - రంగారెడ్డి జిల్లా వార్తలు
రంగారెడ్డి జిల్లా లింగోజీగూడ డివిజన్ ఉపఎన్నిక ప్రచారంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్లెం రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. శాతావాహననగర్లో పెద్దఎత్తున నాయి బ్రాహ్మణులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓటర్లు నమ్మే పరిస్థితి లేరని ఆయన అన్నారు. తమ స్వలాభం కోసం పార్టీలు మార్చే రీతిలో ఇప్పుడున్న నాయకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు గెలిపించుకున్న భాజపా అభ్యర్థి ఆకుల రమేశ్ గౌడ్ ప్రజలకు సేవ చేయకముందే కరోనా కాటుకు బలయ్యారని తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. రమేశ్ గౌడ్ కుమారుడైన అఖిల్ గౌడ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భాజపా నాయకులు, కార్యకర్తలు, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.