ప్రజల సమస్యలకు పక్కనబెట్టి సీఎం కేసీఆర్... ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో పర్యటించిన బండి సంజయ్‌కు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. బస్టాండ్ ముందు పార్టీ జెండా ఎగరేసిన సంజయ్... సర్కారు వైఫల్యాలను ప్రజల మధ్య ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
'కేసీఆర్ అవినీతి బండారాన్ని బయటపెట్టి జైలుకు పంపుతాం' - bjp leader bandi sanjay fire on trs leaders
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘన స్వాగతం లభించింది. డివిజన్ పరిధిలోని చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్ మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి బండి సంజయ్‌కి ఆహ్వానం పలికారు. సర్కారు వైఫల్యాలను ప్రజల మధ్య ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ సూచించారు.
bjp leader bandi sanjay visited in chevella
అభివృద్ధి కార్యక్రమాల పేరుతో కోట్ల రూపాయలు వెనకేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి బండారాన్ని బయటపెట్టి జైలుకు పంపుతామన్నారు. భాజపా కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతామని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా అధికారాన్ని చేపడుతుందని... గోల్కొండ కోటపై జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.