రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం చౌదరిగుడాలో భాజపా ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు, కోడిగుడ్లను పంపిణీ చేశారు. గ్రామంలోని వెయ్యి మందికి సరుకులను అందించినట్లు రాష్ట్ర సీనియర్ నాయకుడు డాక్టర్ ప్రేమ్ రాజ్ తెలిపారు.
వెయ్యి మందికి నిత్యావసర సరుకుల పంపిణీ - BJP State Senior leader is Dr. Prem Raj
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు భాజపా ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు సీనియర్ నాయకుడు డాక్టర్ ప్రేమ్ రాజ్ పేర్కొన్నారు. విపత్కర సమయంలో ప్రజలను ఆదుకోవటానికి దాతలు ముందుకు రావాలని కోరారు.
వెయ్యి మందికి నిత్యావసర సరుకుల పంపిణీ
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రజలెవ్వరూ బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసర సమయంలో బయటకు వస్తే మాస్కులు ధరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ... వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఆయన కోరారు.
TAGGED:
నిత్యావసర సరుకుల పంపిణీ