హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిధిలో ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించాలంటూ భాజపా నాయకులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఎల్బీనగర్, నాగోల్ డివిజన్లలో ఉన్న సమస్యలపై కాలనీవాసులతో కలిసి బీఎన్‌రెడ్డి నగర్ చౌరస్తాలో దీక్షకు దిగారు. గత గ్రేటర్ ఎన్నికల్లో కేటీఆర్ ఇచ్చిన హామీని మర్చిపోయారని రంగారెడ్డి జిల్లా భాజపా అధ్యక్షుడు సామ రంగారెడ్డి విమర్శించారు.
రిజిస్ట్రేషన్ల సమస్యపై భాజపా ఆధ్వర్యంలో నిరాహారదీక్ష - హైదరాబాద్ సమాచారం
ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించాలంటూ భాజపా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎల్బీనగర్లోని బీఎన్ రెడ్డినగర్‌లో నిరవధిక నిరాహారదీక్షకు దిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కార్పొరేటర్లు ప్రజలను మోసం చేశారని రంగారెడ్డి జిల్లా భాజపా అధ్యక్షుడు సామ రంగారెడ్డి విమర్శించారు.
![రిజిస్ట్రేషన్ల సమస్యపై భాజపా ఆధ్వర్యంలో నిరాహారదీక్ష BJP demans tyo solve house registrations in lb nagar division](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9476079-1107-9476079-1604829311874.jpg)
రిజిస్ట్రేషన్ల సమస్యపై భాజపా ఆధ్వర్యంలో నిరాహారదీక్ష
ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కార్పొరేటర్లు ప్రజలను మోసం చేశారని అన్నారు. తెరాస నాయకుల మాటలు విని కాలనీవాసులు విసిగిపోయారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని సామ రంగారెడ్డి డిమాండ్ చేశారు.